నిర్మల్‌చైన్‌గేట్: న్యాక్, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మేసీ్త్రలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శనివారం కూడా కొనసాగింది. మోడల్ ఇందిరమ్మ ఇల్లు నమూనాని మేసీ్త్రలకు చూపించారు. శిక్షణ కేంద్రాన్ని హౌసింగ్ పీడీకే రాజేశ్వర్, డీఈ గంగా ధర్ సందర్శించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ట్రైనింగ్‌లో చెప్పిన ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకోవా లని తెలిపారు. న్యాయ జిల్లా ఇన్‌చార్జి ధ్యావంతు రమేశ్, శిక్షకుడు మహేష్ పాల్గొన్నారు.