నిర్మల్‌టౌన్: ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాదిలో జరగనున్న సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందించనున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీతారాముల కళ్యాణ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్‌లో రూ.151 చెల్లించి రశీదు పొందితే ఇంటి వద్దకే తలంబ్రాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, స్టేషన్ మేనేజర్ ఏఆర్.రెడ్డి, కార్గో ఎగ్జిక్యూటివ్ కిశోర్‌కుమార్, కంట్రోలర్లు పాల్గొన్నారు.