
‘బర్డ్ వాచ్’కు డిగ్రీ విద్యార్థులు
మామడ: జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన 22 మంది విద్యార్థులు ‘ట్రెయిన్ టు ట్రెయినర్’ కార్యక్రమంలో భాగంగా ఆదివా రం దిమ్మదుర్తి రేంజ్ పరిధిలోని తుర్కం చెరు వు, పొన్కల్ చెరువు, యెంగన్న చెరువుల పరి ధిలో ఎకో టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు బర్డ్ వాచింగ్, జంతువుల గుర్తింపుపై శిక్షణ ఇచ్చారు. సఫారి, నేచర్, రా త్రి క్యాంపు ఫైర్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బాసర సీసీఎఫ్ శర్వనన్, డీఎఫ్ వో నాగినిభాను, ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు, రామకృష్ణారావు, ఎఫ్‌ఎస్వో శ్రీనివాస్, అన్నపూర్ణ, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.