బాసర: బాసర ఆర్జీయూకేటీలో శనివారం టెక్‌ఫెస్ట్–2025లో భాగంగా యువ ఉత్సవ్‌ను మిని స్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఎన్‌ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథి గా ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, ఆదిలాబాద్ జిల్లా యూత్ ఆఫీసర్ సుశీల్ భడ్ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ.. జాతీయ సమైక్యతను ప్రోత్సహించడం, భారతదేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వంపై ప్రశంసలు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో భారతదేశ పురోగతిని ప్రదర్శిస్తూనే యువ ఆవిష్కర్తలు, క ళాకారులు, నాయకులను ప్రోత్సహించడానికి ప్ర యత్నిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ పురోగతిని ప్రదర్శించడం, వివిధ రంగాల్లో దేశం సాధించిన గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువ కళాకారులు, యువ రచయితలు, ఛాయాచిత్ర రచన, ప్రశంసల పోటీ, సాంస్కృతిక పోటీ, సైన్స్ మేళా పొటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.2,500, తృతీయ బహుమతిగా రూ.1,500 నగదు అందించారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాకేశ్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ రాములు, జ్యూరీ మెంబర్లుగా డాక్టర్ లకుమాదేవి, డాక్టర్ దేవరాజు, డాక్టర్ మహేశ్, డాక్టర్ రాజేందర్, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.