నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో శు క్రవారం మాన్ కై ండ్ సంస్థ సహకారంతో లె ప్రా ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో మిడ్ లెవె ల్ హెల్త్ ప్రొవైడర్స్‌కు లెప్రసీ, ఫైలేరియాపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాజేందర్ మాట్లాడుతూ.. జి ల్లాలో కుష్ఠు, బోదకాలు వ్యాధిని అరికట్టడానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వణాధి కారి డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, లెప్రా ఇండియా సొసైటీ ఫిజియోథెరపిస్ట్ కిషన్, డిప్యూటీ పీఎంవో గంగన్న, రాజేశ్వర్‌రావు, పీహెచ్‌ఎన్ విమల, ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.