నిర్మల్
‘కడెం’పై సేఫ్టీ బృందం
కడెం ప్రాజెక్ట్‌ను ‘స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్’ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వరద గేట్లు, కౌంటర్ వెయిట్‌లు, లిఫ్టింగ్ రోప్‌లను పరిశీలించారు.
● ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులు 8శాతమే ● రిబేట్ ఇచ్చినా స్పందన అంతంతే ● గడువు పొడిగిస్తారని ఎదురుచూపు ● ఎలాంటి ప్రకటన చేయని సర్కారు
శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025
10లోu
వన్ నేషన్–వన్ ఎలక్షన్‌తో తగ్గనున్న ఆర్థికభారం
నిర్మల్‌చైన్‌గేట్: వన్ నేషన్–వన్ ఎలక్షన్‌తో ప్ర భుత్వానికి ఆర్థికభారం తగ్గుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని గాజులపేట్ మున్నూ రు కాపు సంఘ భవనంలో శుక్రవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ‘ఒక దేశం–ఒక ఎ న్నిక’ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నాయకులు రాంనాథ్, సత్యనారాయణగౌడ్ హాజరై మాట్లాడారు. ‘ఒక దేశం–ఒక ఎన్నిక’ విధానం పక్షపాతాన్ని నివారించి పాలనపై దృష్టిని పెంచుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల కార్తిక్, సుంకరి సాయి, మెడిసెమ్మే రాజు, కమల్ నయన్, ఒడిసెల అర్జున్, మహేశ్, గంగాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
భైంసాటౌన్: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు గడువు మూడురోజుల్లో ముగియనుండగా దరఖాస్తుదారుల్లో స్పందన పెద్దగా కనిపించడంలేదు. ఈ నెల 31 వరకు చెల్లింపు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రిబేట్ కూడా ప్రకటించింది. గడువులోపు ఫీ జు చెల్లించి 25శాతం రాయితీని వినియోగించుకో వాలని మున్సిపల్ అధికారులు ఎంత ప్రచారం చేసినా చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా హె ల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 26,996 దరఖాస్తులు రాగా, వీటిలో పలు కారణాలతో కొన్నింటిని తిరస్కరించి, 18,130 దరఖాస్తులను క్రమబద్ధీకరణకు అర్హత ఉ న్నవిగా గుర్తించారు. అయితే, ఇప్పటివరకు మున్సి పాలిటీలు, గ్రామపంచాయతీలు కలుపుకొంటే 8శా తం మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. శు క్రవారం దరఖాస్తుదారుల తాకిడి పెరగడంతో కొద్దిసేపు సర్వర్ సమస్య తలెత్తింది. దీంతో దరఖా స్తుదారులు ఇబ్బంది పడ్డారు. ఈనెల 31తో గడువు ముగియనున్న నేపథ్యంలో సెలవురోజులైన 30, 31 తేదీల్లోనూ మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
న్యూస్‌రీల్
గ్రామపంచాయతీల్లో...
జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల పరిధిలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌పై ఫీజు రాయితీకి అవకాశం కల్పించారు. 130 గ్రామపంచాయతీల పరిధిలో 2020లో 14,615 దరఖాస్తులు రాగా, ఆయా దరఖాస్తుదారులకు పంచాయతీ అధికారులు ఫోన్లు చేస్తూ ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే రూ.24 లక్షల వరకు ఫీజు రూపంలో వసూలు చేశారు. ఇంకా మూడు రోజులే గడువు ఉండగా, చాలామంది వివిధ కారణాలతో ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తుందని మరికొందరు భావిస్తున్నారు. కానీ.. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశాం. ఏమైనా సందేహాలుంటే, సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ఈనెల 30, 31 తేదీల్లోనూ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం. – బీ రాజేశ్‌కుమార్,
భైంసా మున్సిపల్ కమిషనర్
జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ వివరాలు
మున్సిపాలిటీ దరఖాస్తులు చెల్లించినవారు వసూలు (రూ.కోట్లలో)
నిర్మల్ 10,408 1,193 3.57
భైంసా 6,354 422 0.50
ఖానాపూర్ 1,368 84 0.15
పంచాయతీలు 14,615 1,076 1.63
గడువు మూడురోజులే..
గడువు మూడురోజులే..
గడువు మూడురోజులే..
గడువు మూడురోజులే..