
పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి
లక్ష్మణచాంద: సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొలుగోలు చేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు సీ్త్ర శిశు సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డిని జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు, సభ్యులు శుక్రవారం కలిశారు. వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు తెలిపారు. దీంతో సొసైటీలు ఆర్థికంగా బలోపేతమై రైతులకు ఎరువులు నాణ్యమైన విత్తనాలు, రుణాలు సకాలంలో అందించాయని పేర్కొన్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకపోతే సంస్థలు ఆర్థికంగా నష్టపోయి సిబ్బందికి కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజారతాయని వెల్లడించారు. మంత్రులను కలిసినవారిలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్‌రెడ్డి, పీఏసీఎస్‌ల చైర్మన్లు రమణారెడ్డి, పద్మాకర్‌రావు, గజ్జరాం, ప్రసాద్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌డ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మల్ చైర్మన్ ధర్మాజి రాజేందర్ ఉన్నారు.