
ప్లాంటేషన్‌ను సందర్శించిన ఎఫ్‌డీవో
కడెం: మండలంలోని ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని రాంపూర్ ప్లాంటేషన్‌లో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగింది. సుమారు ఎనిమిది వేల మొక్కలు కాలిపోయాయి. ఎఫ్‌డీవో భవానీశంకర్ శుక్రవారం ప్లాంటేషన్‌ను పరిశీలించి, మొక్కలకు నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు పూర్తిగా కాలిపోలేదని తెలిపారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మైసంపేట్ కుంటవద్ద సోలార్ మోటార్‌తో నీటిని నింపే పనులను పరిశీలించారు. ఎఫ్‌డీవో వెంట ఎఫ్‌ఆర్వో అనిత, డీఆర్వో ప్రకాశ్, అటవీ సిబ్బంది ఉన్నారు.