
యూనిఫామ్ క్లాత్ వచ్చింది
నిర్మల్ రూరల్: వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులకు అందించే యూనిఫామ్‌కు సంబంధించిన క్లాత్ శనివారం జిల్లాకు చేరుకుంది. ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందజేస్తారు. జిల్లాలో మొత్తం 48,874 మంది విద్యార్థులకు ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన వస్త్రం వచ్చింది. వీటిని త్వరలోనే ఆయా మండలాలకు సరఫరా చేయనున్నారు. దీనికోసం ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. మండలాలకు చేరిన యూనిఫామ్ వస్త్రాన్ని సరిచూసుకుని, ఆయా ఎమ్మార్సీలలో భద్రపరచాల ని.. తర్వాత పాఠశాల వారీగా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించి కుట్టించాలని డీఈవో రామారావు ఆదేశించారు. దీనికోసం మండలంలోని ఏపీఎంలను సంప్రదించాలని తెలిపారు. వస్త్రం పూర్తి వివరాలను వెంటనే పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.