నిజామాబాద్: తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని చెప్పాలని ఓ హెచ్‌ఎం తన బడిలోని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. తనపై చర్యలు తీసుకోకుకుండా అడ్డుకోవాలని వారిని డీఈవో కార్యాలయం చుట్టు తిప్పుతున్నారు. ఇందల్వాయి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంపై వచ్చిన ఫిర్యాదులపై ఇటీవల విద్యాశాఖ అధికారు లు విచారణ చేపట్టారు. విచారణలో సదరు హెచ్‌ఎం నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల కు వేతనాలు మంజూరు చేసినట్లు తేలింది.
అతడి పై చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. తన పాఠశాలకు చెందిన పది మంది టీచర్లను వెంటబెట్టుకొని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనకు సహకరించాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. బడి వదిలేసి అందరు టీచర్లను తన వెంట తిప్పుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మహిళ టీచర్లకు సైతం ఫోన్లు చేస్తూ తాను చెప్పిన చోటుకు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. సదరు హెచ్‌ఎం గతంలో మరో ప్రాంతంలో పని చేసినప్పుడు కూడా మహిళా ఉపాధ్యాయులను పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు చేపట్టే సమావేశాలకు గైర్హాజరు అవడం, వారి ఆదేశాలను పాటించకపోవడం అనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎం వేధింపులపై ఉపాధ్యాయులు ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment