28
ఆన్‌లైన్‌లోనూ చెల్లించొచ్చు
రోజులు
నిజామాబాద్ కార్పొరేషన్ పన్ను వసూలు లక్ష్యం
వసూలు సాధ్యమేనా..?
కార్పొరేషన్ పరిధిలో ఆస్తి, ఇంటి, నీటిపన్నుతోపాటు ఇతర పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొత్తం రూ.90 కోట్లు అవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.28కోట్ల వరకు మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మిగిలి ఉన్న 28 రోజుల్లో రూ.62 కోట్లు వసూలు సాధ్యమేనా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజులుగా డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ సిబ్బందితోపాటు తాను కూడా వసూళ్లు చేపడుతున్నారు.
ఆన్‌లైన్‌లో కూడా చెల్లించొచ్చు పన్ను మొత్తాన్ని సంబంధించిన బిల్ కలెక్టర్‌కు నేరుగా చెల్లించి రసీదు పొందాలి. లేదా బల్దియా కార్యాలయంలో, మీసేవా కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లో కూడా చెల్లించొచ్చు.
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ మొత్తంలో పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొత్తం రూ.90కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు దాదాపు రూ.28 కోట్లు వసూలయ్యాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నగరవాసులు సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో పెద్ద మొత్తంలో వసూలు కావాల్సి ఉంది. కార్పొరేషన్ కమిషనర్ దిలీప్‌కుమార్ పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక టీములను రంగంలోకి దించారు. మొత్తం ఐదు సర్కిళ్లకు ఐదుగురు నోడల్ ఆఫీసర్‌లను నియమించారు. ప్రత్యేక టీములు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్ను వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. కమిషనర్‌తోపాటు డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌ను తనిఖీ చేస్తున్నారు. మాట వినని వారికి చెందిన దుకాణాలను సీజ్ చేస్తున్నారు.
మున్సిపల్ కాంప్లెక్స్ అద్దెలే ఎక్కువ
కార్పొరేషన్‌కు చెందిన అద్దె దుకాణాలు (మడిగెలు) సుమారు 500 ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ దుకాణాలను కొందరు గుత్తాధిపత్యం చేసుకుని నిర్వహిస్తున్నారు. బల్దియాకు చెల్లించేది కేవలం రూ.11,500 మాత్రమే. వీరిలో చాలా మంది తమ దుకాణాలను సబ్–లీజ్‌కు ఇచ్చారు. వారి వద్ద రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. కానీ, బల్దియాకు చెల్లించాల్సిన అద్దెలు మాత్రం చెల్లించడం లేదు. కొందరు 2018 నుంచి అద్దెలు చెల్లించనివారు సైతం ఉన్నారు.
మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలు..
కార్పొరేషన్‌కు చెందిన మడిగెల్లో ఓ పార్టీ కార్యాలయంతోపాటు చర్మవ్యాధుల నిపుణుల ఆస్పత్రులు, బిర్యానీ హోటళ్లు, మెడికళ్లు, మొబైల్ దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లు, ఇతర వ్యాపారాలున్నాయి. ప్రతిరోజూ కస్టమర్లతో కిటకిటలాడే ఆ మడిగెలకు సంబంధించి అద్దెలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీరికి కొందరు బల్దియా ఉద్యోగులే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కమిషనర్ దిలీప్‌కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి పన్ను వసూలుకు వెళ్లడంతోపాటు చెల్లించని వారి దుకాణాలను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆరు దుకాణాలను సీజ్ చేశారు. ఒకే రోజు రూ.30లక్షల వరకు వసూలు చేసి మరో రూ.20లక్షలకు చెక్కులు తీసుకున్నారు.
62
ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పన్ను వసూలు పెద్ద సవాల్‌గా మారింది. కేవలం 28 రోజుల వ్యవధిలో సుమారు రూ.62కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్ను వసూలు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్‌ల యజమానులు, స్టార్ హోటళ్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, ఫంక్షన్‌హాళ్లు తదితర వాటికి సంబంధించి పెద్ద మొత్తంలో పన్ను బకాయిలున్నాయి. వీటి వసూలు అధికారులకు కత్తిమీద సాములా మారింది.
రూ.90 కోట్లకు వసూలైంది
రూ.28 కోట్లు
పన్ను చెల్లించని బడా వ్యాపారులు
పేరుకుపోయిన మున్సిపల్
కాంప్లెక్స్ అద్దెలు
జోరందుకోని పన్ను వసూళ్లు
రంగంలోకి కమిషనర్ దిలీప్‌కుమార్
పన్ను చెల్లించి సహకరించాలి
నిజామాబాద్ నగర వాసులు తాము చెల్లించాల్సిన ఆస్తి, నీటి పన్ను సకాలంలో చెల్లించాలి. మార్చి 31వ తేదీ వరకు ఎదురుచూడడం సరికాదు. కొందరు కోర్టుకు వెళ్లి తప్పించునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులున్నా అద్దెలు చెల్లించాల్సిందే. నోటీసులిచ్చినా స్పందించకుంటే దుకాణాలను సీజ్ చేయక తప్పదు.
– ఎస్.దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
28
28
Comments
Please login to add a commentAdd a comment