నిలకడగా నీటిమట్టం
బాల్కొండ: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు ఎస్సారెస్పీకి చేరింది. దీంతో ఆదివారం ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నప్పటికీ ప్రాజెక్టు నీటిమట్టం తగ్గలేదు. సుప్రీం తీర్పు ప్రకా రం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఎ స్సారెస్పీకి వదిలారు. మరోవైపు కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 600, లక్ష్మి కాలువ ద్వారా 250, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 472, ముంపు గ్రామాల లిఫ్ట్‌ల ద్వారా 312 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 479 క్యూసె క్కుల నీరు పోతుండగా, మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1075.00(32.8టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
ప్రాజెక్టులోకి చేరిన బాబ్లీ నీరు
కాలువల ద్వారా కొనసాగుతున్న
నీటి విడుదల
Comments
Please login to add a commentAdd a comment