నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
నిజామాబాద్‌అర్బన్: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను సోమవారం లెక్కించనున్నారు. గత నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించగా.. జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 31,574 మందికిగాను 24,388 మంది ఓటు వేయగా, 77.24 శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 3,751 మంది ఓటర్లకుగాను 3,468 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 92.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56 మంది ఉన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కించనున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలా ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న జాతీయ పార్టీల అభ్యర్థులతోపాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న యూనియన్ల మద్దతుదారుల గెలుపుపై జిల్లాలో చర్చలు మొదలయ్యాయి. తమ మద్దతుదారు విజ యం తథ్యమని, తమకే అనుకూలంగా ఫలితాలు వస్తాయంటూ ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమిపాలవుతారో తెలుసుకునేందుకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే.
గెలుపోటములపై మొదలైన చర్చలు
ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment