
విద్యార్థులు శుభ్రత పాటించాలి
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ
● మైనారిటీ గురుకులం సందర్శన
నిజామాబాద్‌అర్బన్: వసతిగృహాలు, గురుకులాల్లోని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా రి డాక్టర్ బీ రాజశ్రీ సూచించారు. నాగారంలోని మైనారిటీ గురుకులాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, టాయిలెట్స్, హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రతతో విద్యార్థులకు అంటువ్యాధులైన గజ్జి, తామర వంటివి సోకి అస్వస్థతకు గురవుతారని పేర్కొన్నారు. వా ర్డెన్ అందుబాటులో ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వంట చేసేముందు కూరగాయలను శుభ్రంగా కడగాలన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పీవోఎన్సీడీ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సబీయుద్దీన్, హెచ్‌ఈవో గిరిబాబు, నాగరాజు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డిగ్రీ రీవాల్యుయేషన్‌కు
దరఖాస్తు చేసుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (సీబీసీఎస్) పరీక్షలకు సంబంధించి 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, 2, 4, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ (నవంబ ర్, డిసెంబర్– 2024, పరీక్షలకు హాజరైన వి ద్యార్థులు మాత్రమే) పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవా లని కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.500లు, రీవాల్యుయేషన్ ఫామ్‌కు రూ.25లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించండి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,6వ సెమిస్టర్ రెగ్యులర్, 1,3,5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ 2020–24 బ్యా చ్ విద్యార్థులు ఈ నెల 26లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కంట్రోలర్ సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన పరీక్షలు ఏప్రిల్, మేలో జరుగుతాయన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 27వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
జిల్లా హాకీ జట్టు ఎంపిక
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పురుషుల హాకీ టోర్నమెంట్‌కు జిల్లా జట్టు ను ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, రమణ తె లిపారు. ఈనెల 16,17,18 తేదీల్లో కరీంన గర్ జిల్లా హుజూరాబాద్‌లో జరగబోయే రా ష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్రా అంజు, ఈసీ సభ్యులు సడక్ నాగేష్, సీనియర్ క్రీడాకారులు జిన్నా గంగాధర్, నర్సింగ్ పాల్గొన్నారు.
విద్యార్థులు నిర్భయంగా
పరీక్షలు రాయాలి
నిజామాబాద్ సిటీ: పదో తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు సిద్ధం కావాలని, భయపడకుండా పరీక్షలు రాయాలని డీఈవో అశోక్ సూచించారు. జిల్లాకేంద్రంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అసెంబ్లీ నిర్వహణ, విద్యార్థుల హాజరు, క్రమశిక్షణ చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు గణితం పాఠాలు బోధించారు. సుమీష అనే 9వ తరగతి విద్యార్థిని గణితంలో ప్రతిభ చూపడంతో వెంటనే తన జేబులోంచి రూ.500 బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.

విద్యార్థులు శుభ్రత పాటించాలి
Comments
Please login to add a commentAdd a comment