చికిత్స పొందుతూ..
రామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పద్మ దినేష్ (52) మండల కేంద్రంలో ఆధార్, మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దుకాణ పని నిమిత్తం అతడు బైక్‌పై శుక్రవారం కామారెడ్డి వెళ్లి, సాయంత్రం తిరుగుపయనమయ్యాడు. గొల్లపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో బైక్ అదుపుతప్పి అతడు కింద పడగా, ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్‌తోపాటు ఆటోలో ఉన్న పెద్ద బోయిన లింబాద్రి, అతడి భార్యకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దినేష్ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment