కరెంట్ షాక్‌తో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంపూర్‌గడ్డ తండాలో కరెంటు షాక్‌తో ఓ రైతు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన పిట్ల శ్రీను(30) అనే రైతు సోమవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతుల కోసం పోతంగల్ కలాన్ సబ్‌స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టాడు. కానీ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అతడు కిందికి రాకముందే అధికారులు కరెంటు సరఫరా చేశారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న శ్రీను కరెంట్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన గ్రామస్తులు మృతదేహాన్ని పోతంగల్ కలాన్ స్టేజి వద్ద ఉంచి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింప జేశారు. మృతదేహాన్ని సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉంచారు. సబ్‌స్టేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచుతామని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే
కారణమంటున్న గ్రామస్తులు
సబ్‌స్టేషన్‌లోనే మృతదేహాన్ని
ఉంచిన వైనం
రాంపూర్‌గడ్డ తండాలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment