టీబీ రహిత జిల్లాగా మారుద్దాం
డిచ్‌పల్లి: నిజామాబాద్‌ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ గ్రామ పంచాయత్ కార్యక్రమంలో భాగంగా శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్‌లో పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బందికి టీబీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తుకారాం రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో 11 గ్రామ పంచాయతీలను క్షయరహిత (టీబీ ముక్త్) గ్రామాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ డీఎల్‌పీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో టీబీ నిర్మూలన దిశగా పని చేస్తున్నామన్నారు. సమావేశంలో టీబీ కో ఆర్డినేటర్ రవిగౌడ్, ఎంపీవోలు రామకృష్ణ, రాజేశ్, కిరణ్, రాజాఖాన్, తారాచంద్, పంచాయతీ కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
క్షయరహిత గ్రామాలివే..
పడకల్, లక్ష్మాపూర్, పాల్దా, ముల్లంగి(బి), గంగరమంద, పోత్నూర్, తాళ్లరామడుగు, అబ్బాపూర్ (ఎం), సుంకెట్, వడ్యాట్, మల్కాపూర్ తండా.
Comments
Please login to add a commentAdd a comment