భవిష్యత్‌లో సోలార్ విద్యుత్‌కు డిమాండ్
సుభాష్‌నగర్: భవిష్యత్‌లో సోలార్ విద్యుత్‌కు మంచి డిమాండ్ ఉంటుందని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లాలో కొత్తగా సోలార్ పవర్ ప్లాంట్ ఏ ర్పాటు చేయాలనుకునే రైతులు, మహిళలు, యువకులు, వ్యాపారవేత్తలు అవగాహనతోనే ముందుకెళ్లాలని తెలిపారు. నగరంలోని పవర్‌హౌజ్ పరిధిలోగల గోల్డెన్ జూబ్లీ మీటింగ్ హాల్‌లో శనివారం టీజీఎన్‌పీడీసీఎల్, టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కుసుమ్ యోజన పథకంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఔత్సాహికు లు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వి ద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్‌శాఖకు యూనిట్ల రూపంలో విక్రయించడంతో ఆదాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం దరఖాస్తుదారులకు సోలార్ పవ ర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సాంకేతిక విషయాలు, బ్యాంకు రుణాలకు సంబంధించి వివరాలు తెలియజేశారు. ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్, టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రమణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహన్, డీఈలు అల్జాపూర్ రమేష్, వెంకట రమణ, ఉత్తం జాడే, మహ్మద్ ముక్తార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment