
ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులోని గుండ్ల చెరువులో ప్రమాదవశాత్తు పడి కుంట గంగా మోహన్‌రెడ్డి(65) మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మంగళవారం గుండ్ల చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన కుంట గంగామోహన్‌రెడ్డి ప్రమాదవశాత్తు చెరువులో పడి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. మృతుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నాడని స్థానికులు తెలిపారు. గంగామోహన్‌రెడ్డి అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
దుబాయ్‌లో రెడ్డిపేటవాసి..
రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన బట్టు సురేశ్(42) అనే వ్యక్తి దుబాయ్‌లో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్‌కు ఈ నెల 12న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు దుబాయ్‌లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ప్రయత్నిస్తున్నట్లు గల్ఫ్ సంఘ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండ సురేందర్‌రెడ్డి కోరారు.
అడవిపంది దాడి.. ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన కొనగోళ్ల సాయిబాబా అనే వ్యక్తిపై అడవిపంది దాడి చేసినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. సాయిబాబా తన పొలానికి వెళ్తున్న సమయంలో అడవిపంది దాడి చేయడంతో చేతు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సాయిబాబాను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు. అటవీశాఖ అధికారులు బాధితుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బైక్‌ను ఢీకొన్న లారీ
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కామారెడ్డి క్రైం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అతివేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి–సిరిసిల్లా ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నాగుల వినోద్ కుమార్ (30) చేపలు పట్టడం, కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. చేపల పని మీద తన స్నేహితుడు జక్కుల దేవేందర్‌తో కలిసి బైక్‌పై కామారెడ్డికి బయల్దేరారు. ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ సమీపంలోకి రాగానే బైక్‌ను లారీ ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ వినోద్ కుమార్ మృతి చెందాడు. దేవేందర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.

ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతి

ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతి

ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతి