
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
ఖలీల్‌వాడి: గుండెపోటుతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై గంగాధర్ శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన బాచుపల్లి భానుచందర్(36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడో టౌన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఉన్న వైన్స్ దుకాణం ఎదురుగా ఆటోను నిలిపి పాటలు వింటున్నాడు. ఆటోలో మూడు గంటల పాటు అతను కదలకుండా ఉండడాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
లారీని ఢీకొన్న మరో లారీ
భిక్కనూరు: మండల సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టోల్‌ప్లాజా వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా ఢీకొన్నది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలించారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నాగిరెడ్డిపేట: మండలంలోని గోలి లింగాల సమీపంలో ఉన్న మంజీరా నది నుంచి గురువారం రాత్రి ఇసుక ను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టు కొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గోలిలింగాలకు చెందిన కోడె గంగారాం, తొంట సిద్ధిరాములు, పిట్ల సత్యనారాయణ, పుట్ల సంతోష్, కాంచనపల్లి లింగాగౌడ్, పుట్ల కిష్టయ్య ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు యత్నిస్తుండగా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్లను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో ఒకరిపై దాడి
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉన్న కుభీర్ మండలానికి చెందిన కుంచెపు బాబుపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్ వద్ద బాబుతో అనవసరంగా గొడవ పడి మెడపై బ్లేడ్‌తో దాడి చేశాడన్నారు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నిందుతుడి పరారీలో ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఒకరిపై పోక్సో కేసు నమోదు
తాడ్వాయి: తాడ్వాయి పోలీసు పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. తన ఇంటి ఎ దుట ఉన్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడన్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
పెద్దకొడప్‌గల్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన పెద్దకొడప్‌గల్ మండలం రతన్‌సింగ్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తె లిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంక ట్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం మతిస్థిమితం కో ల్పోయాడు. పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వ చ్చేవాడు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన వెంకట్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి