
నాణ్యతా ప్రమాణాలు హుష్‌కాకి..!
నిజామాబాద్‌నాగారం: హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం కాంట్రాక్టర్లకు అలవాటైపోయింది. అందుకే రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు తదితర పనుల్లో కనీస నాణ్యత ప్రమాణాలు కనిపించడం లేదు. పది కాలాలు ఉండాల్సిన నిర్మాణాలు కొన్ని రోజులకే వాటిలోని డొల్లతనం బయటపడుతోంది. పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్‌భండార్ నుంచి దాస్‌నగర్ వరకు వెళ్లే రహదారికి ఇరుపక్కలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారే గానీ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. డ్రైనేజీ నిర్మాణంలో నాసిరకం కంకర, ఇసుక వాడుతున్నారు. స్లాబ్ వేసిన తర్వాత క్యూరింగ్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ కోసం తవ్విన మట్టినే మళ్లీ మాత్రమే వాడుతున్నారు. మొరం వాడటం లేదు. నీళ్లు కూడా సక్రమంగా పెట్టడం లేదు. అలాగే గోల్‌హనుమాన్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు వెళ్లే రహదారిలో, వంద ఫీట్ల రోడ్డులో డ్రైనేజీలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే నిర్మిస్తున్నారు.
మాణిక్‌భండార్ నుంచి దాస్‌నగర్ వరకు డ్రెయినేజీల నిర్మాణం
పనుల్లో కనిపించని నాణ్యత
పర్యవేక్షించని అధికారులు
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
నగరంలో మాణిక్‌భండార్ నుంచి దాస్‌నగర్ వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం అంతా నాసిరకంగా ఉంది. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. స్లాబ్‌లపై నీరు పోయడం లేదు. మొరం వేయడం లేదు. నాసికరం పనులు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తాం. – గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి,
అఖిల భారత రైతు కూలీ సంఘం

నాణ్యతా ప్రమాణాలు హుష్‌కాకి..!

నాణ్యతా ప్రమాణాలు హుష్‌కాకి..!

నాణ్యతా ప్రమాణాలు హుష్‌కాకి..!