
దొడ్డు వడ్లు కొంటలేరు సారూ!
సిరికొండ: కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం వడ్లు కొంటలేరు సారూ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో ఎక్కువ మంది రైతులు సన్న రకం వడ్లను సాగు చేయగా, కొద్ది మంది రైతులు దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. ముషీర్‌నగర్, తూంపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో దొడ్డు రకం వడ్లకు అనుమతి రాక కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. దొడ్డు రకం వడ్లను ఎండబెట్టి కుప్పలు పోసి ఉంచామని, అకాల వర్షాల నుంచి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నామని ముషీర్‌నగర్‌కు చెందిన బట్టు లింబా అనే రైతు వాపోయారు.