చేపలున్నాయా? లేవా? | - | Sakshi
Sakshi News home page

చేపలున్నాయా? లేవా?

Published Fri, May 2 2025 1:25 AM | Last Updated on Fri, May 2 2025 1:25 AM

చేపలు

చేపలున్నాయా? లేవా?

బాల్కొండ: అనాధిగా కుల వృత్తినే నమ్ముకుని ఎస్సారెస్పీలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు చేపలు దొరకక ఉపాధి కోల్పోతున్నారు. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నిత్యం 5వేల కుటుంబాల మత్స్యకారులు చేపల వేటను సాగిస్తారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీరు తగ్గుముకం పట్టింది. దీంతో చేపల కోసం వేట సాగిస్తున్న మత్స్యకారులకు చేపలు దొరకక నిరాశే మిగులుతోంది.

ఈ ఏడాది 31లక్షల చేప పిల్లలు..

ఎస్సారెస్పీలో ప్రభుత్వం ఉచితంగా ఏటా 62 లక్షల చేప పిల్లలను వదులుతుంది. కానీ ప్రస్తుత సంవత్సరం 31 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలారు. వీటితోపాటు ప్రాజెక్ట్‌లో స్వయంగా చేపలు చేప పిల్లల ఉత్పత్తిని చేస్తాయి. అయినా చేపల వేట ప్రస్తుతం అంతంతా మాత్రంగానే ఉంది. దీంతో ప్రాజెక్ట్‌లో అసలు చేపలు ఉన్నాయా.. లేదా అంటూ మత్స్యకారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే మత్స్యకారులు ప్రాజెక్ట్‌లో చేపల వేట కోసం వాలుతున్నారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్ట్‌లో తెప్పలపై సంచరిస్తూ వలలు వేస్తున్నారు. అయినా చేపలు చిక్కడం లేదంటున్నారు. పడితే షికారి లేదంటే బికారీ అన్నట్లుగా పరిస్థితి ఉందంటున్నారు. ఒక్కో రోజు ఖర్చులకు డబ్బులు రాని దుస్థితి ఉందంటున్నారు. వేట సాగకుంటే పూట గడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎస్సారెస్పీలో గతంలో అనేక నాసిరకం చేప పిల్లలను వదలడంతోనే చేపలు లేకుండా పోయాయనే విమర్శలు వినవస్తున్నాయి. నీరు తగ్గుముకం పట్టిన సందర్భంలో కూడ చేపలు చిక్కకుంటే నీరు నిండుగా ఉన్నప్పుడూ పరిస్థితి ఎంటాని జాలర్లు ఆందోళన చెందుతున్నారు. వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల సమయం, వరద కాలువ ద్వారా నీటి విడుదల సమయంలో ఎక్కువ మొత్తంలో చేపలు వెళ్లిపోతున్నాయంటున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.

ఎస్సారెస్పీలో జాలర్లకు

చిక్కని మత్స్యసంపద

కుల వృత్తిని నమ్ముకున్న

మత్స్యకారులకు వేట సాగక ఇబ్బందులు

కుల వృత్తినే నమ్ముకున్నాం..

తాతా ముత్తాతల నుంచి కుల వృత్తినే నమ్ముకుని బతుకుతున్నాం. చేపల వేట సాగక ఇంట్లో పూడ గడవడం లేదు. ప్రభుత్వం ఇతర పనులను కల్పించి మత్స్యకారులను ఆదుకోవాలి. ఎండ కాలంలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా బతుకుతాం.

– సాయిలు, మత్స్యకారుడు, బాల్కొండ

చేపలు చిక్కడం లేదు..

ప్రాజెక్ట్‌లో చేపలు చిక్కడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, రాత్రిల్లో కూడ వేటాడుతున్నాం. కాని చేపలు రావడం లేదు. దీంతో ఖర్చులు కూడ మీదనే పడుతున్నాయి. చేపలు ఉన్నాయో లేదో తెలియడం లేదు.

– భాస్కర్‌, మత్స్యకారుడు, రెంజర్ల

చేపలున్నాయా? లేవా?1
1/2

చేపలున్నాయా? లేవా?

చేపలున్నాయా? లేవా?2
2/2

చేపలున్నాయా? లేవా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement