
ఆర్‌ఎంను కలిసిన కామారెడ్డి డీఎం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్నని కామారెడ్డి డిపో మేనేజర్ దినేశ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవల ఖమ్మం డిపో నుంచి కామారెడ్డి డిపోకు బదిలీపై వచ్చారు. గతంలో నిజామాబాద్ అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేశారు.
రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతిగా డా. పవన్ చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 నుండి 2013 వరకు రుద్రూర్ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రానికి బదిలీపై వెళ్లారు. 2017 వరకు ఏరువాక కేంద్రం అధిపతిగా పనిచేశారు. రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఆరు నెలలపాటు పదోన్నతిపై సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2023 వరకు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా, 2023 నుంచి 2025 వరకు హైదరాబాద్‌లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ చంద్రారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
● రోడ్లపై మక్కల రాసుల వద్ద సూచికలుగా రేడియం డబ్బాలు
మోర్తాడ్(బాల్కొండ): అతని ఆలోచన చిన్నదే కానీ.. పెద్ద ప్రమాదాలను నివారించేలా ఉండటంతో వాహనదారుల ప్రశంసలు అందుకుంటున్నాడు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి పక్కన బండరాళ్లు పెడుతుండడంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మోర్తాడ్‌కు చెందిన పోలోజు శ్రీకాంత్ ధాన్యం వద్ద బండరాళ్లకు బదులుగా రేడియం స్టిక్కర్లు ఉన్న డబ్బాలను పెడుతూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాడు. మోర్తాడ్ నుంచి పాలెం, తిమ్మాపూర్, సుంకెట్, రామన్నపేట్, దొన్కల్, రెంజర్ల తదితర ప్రాంతాల్లో వంద రేకు డబ్బాలను సూచికలుగా ఏర్పాటు చేశాడు. రేడియం స్టిక్కర్ల డబ్బాల ఏర్పాటుతో మక్కలు ఆరబోసిన విషయాన్ని గుర్తించి వాహనదారులు నెమ్మదిగా వెళ్లడం జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు.

ఆర్‌ఎంను కలిసిన కామారెడ్డి డీఎం

ఆర్‌ఎంను కలిసిన కామారెడ్డి డీఎం