సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు | ganesh chaturthi celebration in singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

Published Mon, Oct 4 2021 11:07 AM | Last Updated on Mon, Oct 4 2021 11:16 AM

ganesh chaturthi celebration in singapore - Sakshi

సింగపూర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 'సింగపూర్ తెలుగు సమాజం' ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న శివన్ దేవాలయంలో భక్తులు వినాకయ చవితి పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు.కోవిడ్ -19 నిబంధనలకు  అనుగుణంగా ఆన్‌లైన్‌లో జరిగి ఈ పూజా కార్యక్రమంలో 100 మందికి భక్తులు బాల గణపతి పూజ చేశారు. వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా చందనంతో చేయించబడిన బాలగణపతి ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ  సందర్భంగా సమాజ అధ్యక్షులు  కోటిరెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూజలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాల్ని అందించినట్లు చెప్పారు.

 

కోవిడ్ -19 కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాన్ని సుమారు 400 మంది తెలుగు కుటుంబాలు వీక్షించయాని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉత్తమ అలంకరణ పోటీలలో సుమారు 50 మంది బాలబాలికలు భక్తుల్ని ఆకట్టుకున్నారు. షర్విన్, అర్జున్, ప్రాచి, యువన్, నిత్య'లు బహుమతుల్ని అందించారు. అనంతరం కార్యవర్గసభ్యులకు , దాతలకు , పూజాకార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement