అట్లాంటా: అమెరికాలోని తెలుగు ప్రజల కోసం గాటా(గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్) అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అట్లాంటాలోని లిండ్‌బర్గ్ స్టేషన్ సమీపంలోని ఈఓఎన్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా అగ్ని ప్రమాదానికి తీవ్రంగా నష్టపోయిన వంద మందిపైగా భారత సంతతి(తెలుగు) విద్యార్థులకు గాటా నిత్యావసర వస్తువులు, కిరాణా సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకుంది. అయితే విద్యార్థులకు టిఫిన్‌కు అవసరమయ్యే వస్తువులు, పండ్లు, కర్రీస్, చపాతీలను సువీదా స్టోర్స్ అందించింది.
విద్యార్థులకు సహాయాన్ని అందించిన సువీదా స్టోర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు ప్యాన్లు, కుండలు, రైస్ కుక్కర్లు అందించిన సరస్వతి, రేణుక తదితరులకు గాటా కృతజ్ఞతలు తెలియజేసింది. కాగా 200 మందికి సరస్వతి, వారి మిత్రులు భోజన సదుపాయాన్ని కల్పించారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్యా 100 దుప్పట్లు, పది టీవీలను అందించిన ప్యాడీ రావు, రాధా గార్లకు గాటా కృతజ్ఞతలు తెలిపింది. క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు గాటా ఎప్పుడు ముందుంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment