లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు | Opening Ceremony of Sri Venkateswara Balaji Temple in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు

Published Tue, Apr 2 2024 6:30 PM | Last Updated on Wed, Apr 3 2024 1:47 PM

Opening Ceremony of Sri Venkateswara Balaji Temple in London - Sakshi

శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ బ్రాక్‌నెల్‌లోని మొదటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం 30 మార్చి 2024న ప్రారంభించింది.

పురాతన హిందూ గ్రంధాలు, శిల్ప స్థాపత్య శాస్త్రాలను అనుసరించి రెండు రోజుల పాటు ప్రారంభ వేడుకలు వరుస శుభ కార్యక్రమాలతో నిర్వహించారు. శ్రీ శ్రీనివాస శర్మ, ప్రధానార్చకులు, పలువురు అర్చకుల చేత ఘనంగా   శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగాయి.

లండన్‌లో చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని స్థాపించాలనే వారి విస్తృత ఆశయాన్ని సాకారం చేయడంలో ఇది ప్రారంభ మైలురాయిగా ఉంటుందని ఆలయ నిర్వాహకులు  ఆనందం వ్యక్తపరిచారు.

SVBTCC ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, కృష్ణ కిషోర్, సురేష్ రెడ్డి, కమలా కోట చర్ల, ప్రవీణ్ మస్తీ, సురేష్ గోపతి, భాస్కర్ నీల మరియు పావని రెడ్డి సహా ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు తుకారాం రెడ్డి, రవి వాసా, రవి శ్రీరంగం, వంశీ వి, వంశీ బి, విశ్వేశ్వర్ గోవర్ధన్, రాఘవేంద్ర, గౌతం శాస్త్రి మరియు గోపి కొల్లూరు సంఘం సభ్యులు, వాలంటీర్లు , భక్తులకు తమ గణనీయ సహకారం అందించినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు.  వీరందరి సహకారంతో ఈ కార్యం సాధ్యమైందని కొనియాడారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 లండన్‌లోని ఈ ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం,  సాయంత్రం భక్తుల సౌకర్యార్థం  తెరిచి ఉంటుంది

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement