స్వర్ణవంశీ - శుభోదయం మ్యూజిక్‌ అవార్డు అందుకున్న విజయలక్ష్మీ | Singer Vijayalaxmi Got Subhodayam Music Award | Sakshi
Sakshi News home page

స్వర్ణవంశీ - శుభోదయం మ్యూజిక్‌ అవార్డు అందుకున్న విజయలక్ష్మీ

Published Thu, Nov 11 2021 8:33 PM | Last Updated on Thu, Nov 11 2021 8:58 PM

Singer Vijayalaxmi Got Subhodayam Music Award - Sakshi

వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా, శుభోదయం గ్రూప్‌ ఇండియాలు సంయుక్తంగా  సింగింగ్‌ స్టార్‌ విజయలక్ష్మికి స్వర్ణ-వంశీ శుభోదయం మ్యూజికల్‌ అవార్డు-2021ని ప్రకటించారు. శుభోదయం గ్రూప్‌ మేనేజింగ్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌ కలపటపు ఈ అవార్డు బహూకరించారు. శుభోదయం ఛైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. శుభోదయం గ్రూప్‌ తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు దోహదం చేసే కార్యక్రమాలకు అంతర్జాతీయంగా సహకరిస్తుందన్నారను. గత 50 ఏళ్లుగా వంశీ సంస్థ సాంస్కృతిక సేవారంగాలకు ఎనలేని సేవ చేస్తుందన్నారు.

 ఈ సందర్భంగా నేషనల్‌ బ్యాంకార్డ్‌ అధ్యక్షులు ఇఫ్తెకార్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ‘అమెరికా, యూకే, గల్ఫ్‌, మలేషియా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాలు పర్యటించి తెలుగు, హిందీ, మళయాళం, కన్నడ, తమిళం, రాజస్థానీ, ఒరియా భాషలలో విజయలక్ష్మి అనేక పాటలు పాడరని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి ప్రముఖ గాయని శారద ఆకునూరి, సింగపూర్‌నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్‌ కవుటూరు, రాధికా మంగిపూడి, తెలుగు కళాసమితి ఖతార్‌ నుంచి దాని అధ్యక్షులు తాతాజీ ఉసిరికలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement