ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా: విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత & సంబరాల సంస్కృతిని తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు విమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే.
‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ‘వేటా’ స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి సెప్టెంబర్ 25న వాషింగ్టన్ డీసీ, వర్జీనియా ప్రాంతంలో.. అక్టోబర్ 1న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సాన్ రమోన్ నగరం.. అక్టోబర్ 2న న్యూ జెర్సీలోను ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ సంవత్సర వేడుకల్లో ప్రముఖ సినీ తార, టీవీ యాంకర్ ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వేటా సంస్థ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ,అడ్వౌజరీ కౌన్సిల్ కో-చైర్ డాక్టర్ అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment