దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడీయా ఆత్మీయ సమావేశం జరిగింది. యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, యూఏఈ ముఖ్య సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియా కో ఆర్టినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ కుటుంబ అభిమానులు సైతం భారీగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో సజ్జల భార్గవ రెడ్డి మాట్లాడుతూ..జగనన్న మీద మీరు చూపించే అభిమానం నాకు మరింత స్ఫూర్తి నిచ్చింది. రాబోయే ఎన్నికల్లో మనందరం కష్టపడి 175 టార్గెట్ గా పని చేయాలని పిలుపినిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఒక గొప్ప నాయకుడి కోసం పని చేయడం చాలా గర్వంగా ఉందని మేడపాటి వెంకట్ అన్నారు. ప్రవాసంధ్రులకు జగనన్న ఎప్పుడూ అండగా ఉంటారని, పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు "జగనన్న విదేశీ విద్యా దీవెన" కార్యక్రమం ద్వారా కోటి రూపాయల వరకు ఫీజు చెల్లిస్తున్న మనసున్న నాయకుడు జగన్ అని పేర్కొన్నారు.
చల్లా మధు సూధన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు. మీరు ఎప్పుడైనా మీ సొంతూరికి వెళ్లి చూడండి. గతంలో ఎలా ఉందో, ఇప్పుడు మీ గ్రామం ఎలా ఉందో తేడా గమనించండి. జగనన్న తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల కోసం మరింత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment