వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్) మారథాన్ 24–25కు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏడు సైన్స్ ప్రాజెక్ట్‌లు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సైన్స్ పోటీలకు దేశ వ్యాప్తంగా 1,575 టీమ్ ఐడియాస్ ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 76 ఎంపికై నట్లు పేర్కొన్నారు. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏడు ఎంపిక కావటం విశేషమని తెలిపారు. వాటిల్లో ఏపీ బాలయోగి గురుకులం (జగ్గయ్యపేట)కు చెందిన ఆరు ప్రాజెక్ట్‌లు, ఏపీ మోడల్ స్కూల్ (గంపలగూడెం) నుంచి ఒక ప్రాజెక్ట్ ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న ప్రాజెక్ట్‌ల ఉపాధ్యాయులను, విద్యార్థులను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అభినందించినట్లు పేర్కొన్నారు.
సూపర్ మార్కెట్లో విద్యార్థి నిర్బంధం
ఇబ్రహీంపట్నం: కళాశాల విద్యార్థి దొంగతనం చేశాడనే నెపంతో స్థానిక ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకులు మూడు గంటలపాటు గదిలో నిర్భందించి చిత్రహింసలు పెట్టిన ఘటన సోమ వారం జరిగింది. సరుకుల కొనుగోలుకు వచ్చిన ఓ కళాశాల విద్యార్థి రెండు ప్యాకెట్లు కొనుగోలు చేయకుండా జేబులో పెట్టుకుని తస్కరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన ఆ దుకాణ యాజమా న్యం విద్యార్థిని బంధించినట్లు చెబుతున్నారు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న విద్యార్థి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జరిగిన విషయంపై ఆరా తీసి, విద్యార్థిని విడిపించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీ సులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రానికి చెందిన రవి(52) అనే వ్యక్తి సుమారు 30ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. బందరురోడ్డులో ఒక టిఫిన్ బండి వద్ద పూరి మాస్టార్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10గంటల సమయంలో టిఫిన్ బండి వద్ద కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఉలుకూ పలుకూ లేకపోవడంతో చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చూసి మృతి చెందినట్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనధికార కట్టడాల కూల్చివేత
పెనమలూరు: యనమలకుదురులో అనధికార కట్టడాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధి యనమలకుదురులో కుప్పలు తెప్పలుగా అనఽధికార నిర్మాణాలు చేపట్టారు. వీటికి ఎటువంటి అనుమతులు లేవు. అనుమతులు లేని కట్టడాలు, లేఅవుట్లపై గతంలో ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రావటంతో అధికార యంత్రాంగం స్పందించింది. గ్రామంలో అనధికార కట్టడాలు గుర్తించి వాటిలో ఐదు కట్టడాలను సోమవారం కూల్చివేశారు. మసీదు వద్ద నాలుగు, డొంక రోడ్డులో ఒక నిర్మాణాన్ని కూల్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వివరాలు తెలుపుతూ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అనధికార కట్టడాలు చేపట్టరాదన్నారు. వినియోగదారులు స్థలాలు, భవనాలు కొనుగోలు చేసే సమయంలో అనుమతులు ఉన్నాయో లేదో ముందుగానే తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment