విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
భూసేకరణ గగనమే..
పరామర్శకు వెళితే కేసులు కడతారా..
–8లోu
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు
అదిగో.. ఇదిగో.. మెట్రో రైలు అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి హడావుడి చేసిందో.. ప్రస్తుతం కూటమి హయాంలోనూ అలాంటిదే జరుగుతోంది. భూసేకరణ ప్రతిపాదనలు కూడా రాకుండా మెట్రో రైలు వచ్చేసిందంటూ ఊదరగొడుతోంది. ప్రతిపాదనలు, గ్రాఫిక్‌ల కనికట్టు చేస్తూ గతంలో తెచ్చిన వాటినే మళ్లీ తెరపైకి తెచ్చి హంగామా చేస్తున్నారు కూటమి పాలకులు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మెట్రో రైలు కూత వినపడే పరిస్థితి ఇప్పట్లో కానరాకపోయినా పాలకులు మాత్రం హడావుడి చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో మరోసారి మెట్రో డ్రామా తెరపైకి వచ్చింది. మెట్రో రైలు అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. దీనికి ప్రతిపాదనలు, గ్రాఫిక్‌లు అంటూ కనికట్టు చేస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ మాయ చేసింది. మెట్రో రైలు వచ్చేసిందంటూ ఊదరగొట్టింది. అప్పుటి ప్రతిపాదనలనే ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చి హంగామా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా కనీసం భూసేకరణకు సంబంధించి ఎన్టీఆర్, కృష్ణా జిల్లా కలెక్టరేట్లకు ప్రతిపాదనలు సైతం ఇప్పటి వరకు రాక పోవడం గమనార్హం.
అడ్డంకులను అధిగమించి.. అడుగులు పడేనా....!
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) అధికారులు తొలిదశలో గన్నవరం, పెనమలూరు రెండు కారిడార్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు హడావుడి చేస్తున్నారు. 1వ కారిడార్ 26 కిలో మీటర్లు, పీఎన్‌బీఎస్ నుంచి ఆరంభమై విజయవాడ రైల్వేస్టేషన్ మీదుగా రామవరప్పాడు జాతీయ రహదారిపైకి వచ్చి అక్కడ నుంచి గన్నవరం వరకు వెళ్తుంది. 2వ కారిడార్ కింద 12.5 కిలోమీటర్లు పీఎన్‌బీఎస్ నుంచి ఆరంభమై ఎంజీరోడ్డు మీదుగా బెంజిసర్కిల్.. ఆటోనగర్ మీదుగా పెనమలూరు వరకు వెళ్లనుంది. అంటే మొత్తం రెండు కారిడార్లకు 34 స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 20, కృష్ణా జిల్లాలో 14 స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ గతంలో చేసిన ప్రతిపాదనలే. వీటిని పాలకులు మళ్లీ తెరపైకి తెచ్చారు. నిర్మాణ వ్యయం రూ. 11,009 కోట్లు, భూసేకరణ వ్యయం రూ.1,152 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో మెట్రోస్టేషన్ నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందని ఏపీఎంఆర్‌సీ అధికారులు లెక్క కట్టారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో భూగర్భంలో మూడు కిలోమీటర్ల దూరం మెట్రో రైలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజధాని ప్రాంతానికి ముఖద్వారమైన విజయవాడను ‘ట్రాఫిక్’ క్రమశిక్షణతో కూడిన నగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం రహదారి భద్రత కమిటీ (డీఆర్‌ఎస్‌సీ) సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, బ్లాక్ స్పాట్‌ల వద్ద తీసుకున్న చర్యలు, రహదారి భద్రత ఉల్లంఘనలపై చర్యలు, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ స్కీం–2022, ఐ–రాడ్ అమలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.
ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించే అస్త్రం యాప్‌పై కమిటీలో చర్చించారు. 2024లో జిల్లాలో మొత్తం 1,343 రహదారి ప్రమాదాలు జరిగాయని, వీటిలో 431 మరణాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. ఈ మరణాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాలతో 212, రాష్ట్ర హైవేలపై ప్రమాదాలతో 79, ఇతర రహదారులపై ప్రమాదాలతో 140 సంభవించాయని వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్నారు.
బ్లాక్‌స్పాట్‌లు..
ఎన్‌హెచ్–16పై 17 బ్లాక్‌స్పాట్‌లు, ఎన్ హెచ్–30పై 17, ఎన్‌హెచ్–65పై 49, ఎస్‌హెచ్–192పై 1, ఎస్‌హెచ్–236పై 3, ఎస్‌హెచ్–32పై 3, ఇతర రహదారులపై 49 మొత్తం 139 హాట్‌స్పాట్లను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఒక్క ప్రమాదం కూడా జరగ కుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.
సమగ్రంగా ట్రాఫిక్ డేటా విశ్లేషణ: సీపీ
జిల్లాతోపాటు విజయవాడలో ట్రాఫిక్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడానికి రియల్‌టైమ్ డేటాను విశ్లేషిస్తున్నామని.. ఆ ఫలితాల ఆధారంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. బెంజిసర్కిల్ వద్ద అనలిటిక్స్‌ను విశ్లేషించగా.. 84 శాతం మంది హెల్మెట్‌ను ధరించినట్లు వెల్లడైందని తెలిపారు. ట్రాఫిక్ పరిస్థితుల అధ్యయనానికి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీసీపీలు గౌతమిశాలి, మహేశ్వరరాజు, కేజీవీ సరిత, ఎం.కృష్ణమూర్తి నాయుడు, డీటీసీ ఎ.మోహన్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌సీసీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు
7
న్యూస్‌రీల్
మైట్రో రైలుకు సంబంధించి భూసేకరణ చేయాలంటే కత్తిమీద సామే. రెండు జిల్లాల్లో కలిపి 91 ఎకరాల భూమిని సేకరించాల్సింది. మైట్రో రైలు వెళ్లే మార్గం పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదల, ప్రసాదంపాడు, నిడమానూరు, ఎనికేపాడు వంటి కీలక ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సింది. ఇప్పటికి భూసేకరణకు సంబంధించి ప్రతిపాదనలు ఏపీఎంఆర్‌సీ నుంచి ప్రతిపాదనలు కలెక్టరేట్‌లకు చేరలేదు. చేరిన తర్వాత నోటిఫికేషన్‌లు ఇవ్వడం, భూసేకరణకు బాగా సమయం తీసుకొనే అవకాశం ఉంది. అంటే గతంలో మాదిరే కూటమి ప్రభుత్వం విజయవాడ నగరవాసులకు మెట్రో రైలు అంటూ ఊరించి ఉసూరుమనిపించే అవకాశం ఉందనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment