పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
చల్లపల్లి: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఆముదార్లంకలో చోటుచేసుకుంది. చల్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆముదార్లంకకు చెందిన తిరుమలశెట్టి రమణ(41) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమణకు భార్య శ్యామలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో పెద్దమనుషుల సమక్షంలో మూడు సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి శ్యామలమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోగా రమణ తన సోదరుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన రమణ బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న రమణ కుటుంబ సభ్యులు వెంటనే రమణను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించటంలో అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రమణ గురువారం ఉదయం మృతి చెందాడు. రమణ సోదరుడు ఏడుకొండల ఫిర్యాదు మేరకు చల్లపల్లి హెడ్‌కానిస్టేబుల్ బీవీఎస్‌వీ ఈశ్వరప్రసాద్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment