గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా , నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి రజని (ఈస్ట్), జాయింట్ సెక్రటరీ కొమ్మవీర వెంకట స్వప్న, రైతు విభాగం కార్యదర్శి కలపాల నెహ్రూ, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, కార్యదర్శి పల్లెం రవికుమార్, బూత్ కమిటీస్ వింగ్ కార్యదర్శి చలమాల అనిల్ కుమార్, పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి చిట్టిబొమ్మ శ్రీహరి నియమితులయ్యారు.
జిల్లా అనుబంధ విభాగం కమిటీ అధ్యక్షులు
రైతు విభాగం అధ్యక్షుడిగా ఏలూరి శివాజీ (జగ్గయ్యపేట), బీసీ సెల్ ప్రెసిడెంట్ మార్త శ్రీనివాస్ (నందిగామ), స్టూడెంట్ వింగ్ జొన్నలగడ్డ కోమలి సాయి (ఈస్ట్), వీవర్స్ వింగ్ తంగెళ్లమూడి రామారావు(నందిగామ), అంగన్‌వాడీ వింగ్ శాఖమూరి వెంకట కుమారి ( నందిగామ), డాక్టర్స్ వింగ్ అంబటి నాగరాధాకృష్ణ (సెంట్రల్), దివ్యాంగుల విభాగం మెట్టు వెంకటరెడ్డి(వెస్ట్) నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment