21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
విజయవాడ కల్చరల్: రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రంగం రాజేష్ సోమవారం తెలిపారు. బాలోత్సవ్ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా ఉద్యమగీతాలు, దేశ భక్తి జానపదగీతాలు, అభ్యుదయ గీతాలాపన కార్యక్రమాన్ని గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి గాయనీ గాయకులు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
తెలుగు భాషలో పోటీలు..
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మాతృ భాషా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన విజయవాడలోని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని తెలుగు శాఖ, ఉయ్యూరులోని ఏజీఅండ్ ఎన్‌జీ సిద్ధార్థ కళాశాలలోని తెలుగుశాఖ సంయుక్తంగా తెలుగు భాషలో పోటీలను నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ ప్రకటనలో తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఈ పోటీలు విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. పద్యాలాపన, ఆంగ్లపదాలకు తెలుగుమాటలు రాయడం, అచ్చంగా తెలుగులో మాట్లాడడం, తెలుగు గద్యపఠనం పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ నెల 19వ తేదీలోగా 83748 65621, 98485 47022ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment