వాదనలు సమర్థంగా వినిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం– బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, నాగార్జున సాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆవశ్యకత, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న 66 శాతం వాటా కొనసాగింపు, నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ ఎడమకాలువ 3వ జోన్ లో ప్రస్తుతం సాగుచేసిన ఆరుతడి పంటలను రక్షించటానికి పూర్తి స్థాయిలో సాగునీటి విడుదల వంటి విషయాలను ప్రస్తావించారు. ఎన్‌ఎస్‌పీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ పరిధిలో సాగు చేసిన పంటలను రక్షించేందుకు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment