No Headline
పెనుగంచిప్రోలు: రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు ధర ఎక్కువగా ఉండదు. లేనప్పుడు ధర అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి పంటను సర్వనాశనం చేస్తుంది. అయితే టమాటా రైతులకు వాటి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్‌లో ధర లేక రైతులు లబోదిబో మంటున్నారు. కోత కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.15 అమ్ముతున్నా తమ వద్ద మాత్రం కిలో కేవలం రూ.4 నుంచి రూ.5కు కొనుగోలు చేస్తున్నారని, తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు అంటున్నారు.
నియోజకవర్గంలో ..
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రబీ సీజన్‌లో సుమారుగా 54 ఎకరాల్లో సాగు చేశారు. దీనిలో జగ్గయ్యపేట మండలం 35, వత్సవాయి మండలం 8ఎకరాలు, పెనుగంచిప్రోలు మండలం 11 ఎకరాలు ఉంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు, పోటీతత్వం కారణంగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ధర దారుణంగా పడిపోయింది. రైతు వద్ద కిలో రూ.4 నుంచి రూ.5కి వ్యాపారులు అడుగుతుంటే జగ్గయ్యపేట రైతుబజార్‌లో కిలో రూ.14 బోర్డు ఉంది. బయట మార్కెట్‌లో కిలో రూ.15 అమ్ముతున్నారు. సరైన మార్కెట్ సదుపాయం కూడా లేక పోవడంతో రైతు దారుణంగా నష్టపోతున్నాడు.
కిలో ధర రూ.4 నుంచి రూ.5 లోపే కోయకుండా తోటలు వదిలేస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment