టమాటా రైతుకు కన్నీళ్లే | - | Sakshi
Sakshi News home page

టమాటా రైతుకు కన్నీళ్లే

Published Sun, Feb 23 2025 1:21 AM | Last Updated on Sun, Feb 23 2025 1:20 AM

టమాటా

టమాటా రైతుకు కన్నీళ్లే

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

7

నేడు బాధ్యతల స్వీకరణ

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కూన రాంజీ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఆంధ్ర యూని వర్సిటీ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా చేస్తూ వైస్‌చాన్సలర్‌గా యూనివర్సిటీకి వచ్చారు.

–8లోu

శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

తోట్లవల్లూరు: శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్‌ డీఎల్వీ రమేష్‌బాబు ఆదేశించారు. ఐలూరులోని శ్రీగంగా పార్వతీ సమేత శ్రీరామేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. తొలుత రామేశ్వరస్వామిని, రఘునాయకస్వామిని దర్శించుకుని పూజలు జరిపి, వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయంలో శివరాత్రికి చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఐలూరు క్షేత్రానికి ఉన్న విశిష్టత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయంలో తోపులాటలు లేకుండా క్యూలు పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గన్నవరం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ అనురాధ, ఆలయ మేనేజర్‌ శివగోపాలరావు పాల్గొన్నారు.

పరిశోధనల్లో సహకారం

కోనేరుసెంటర్‌: పరిశోధన అంశాల్లో అధ్యాపకులకు, విద్యార్థులకు సహకారం అందిస్తామని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ క్వీన్స్‌ ల్యాండ్‌ ప్రొఫెసర్‌ ప్రసాద్‌ యార్లగడ్డ హామీ ఇచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయం రసాయన విభాగం, ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ బయోమెమిటిక్‌ నానోస్ట్రక్చర్డ్‌ మెటీరియల్స్‌పై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కంబేటింగ్‌ యాంటిమిక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ను ఎదుర్కోవడంతో పాటు బయోమెడికల్‌ అప్లికేషన్‌లను మెరుగుపరచడాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో రెక్టర్‌ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు, రసాయనశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్‌ సుజాత, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటం, సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపోయాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి గతంలో పటిష్టంగా అమలు చేసిన ఇంటికే వైద్యం అందించడాన్ని పాలకులు మరిచిపోయారు.

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు ఇంటికెళ్లిన తర్వాత ఫాలోఅప్‌ చేయడం లేదు. టెలి మెడిసిన్‌ సేవలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. దీంతో ఆరోగ్య రంగం నిర్వీర్యంగా మారింది. ప్రజలకు అనారోగ్యం చేస్తే పట్టించుకునే వారే కరువయ్యారు. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్‌సీడీ–సీడీ సర్వే ముందుకు సాగడం లేదు. ఇలా అనేక సమస్యలతో ప్రభుత్వ సహకారం లేక వైద్య ఆరోగ్యశాఖ కుంటుపడింది.

నాడు ఇంటి వద్దకే వైద్యం

తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమైన రోగులకు గతంలో ఇంటికే వెళ్లి వైద్యం అందించిన ఫ్యామిలీ ఫిజీషియన్లు ఇప్పుడు కనిపించడం లేదు. నెలలో రెండు రోజులు గ్రామాలను సందర్శించి ఆరోగ్యశ్రీలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసే వాళ్లు.. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు సైతం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది.

కొరవడిన సమన్వయం.. పట్టించుకోని ఉన్నతాధికారులు

విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌ల్లోని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌ఓ)లు, సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎవరికి వారే అనే రీతిలో ఉమ్మడి జిల్లాల్లో వారి సేవలు కొనసాగుతున్నాయి. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు వచ్చిన వారికి సేవలు అందించడమే తమ పని అంటూ సీహెచ్‌ఓలు కూర్చుంటున్నారు. మరోవైపు మేము సచివాలయం వారు అప్పగించిన పనిచేస్తామంటూ ఏఎన్‌ఎంలు ఉంటున్నారు.

ఇలా వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచి వార్‌ నడుస్తున్నా వైద్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అనేక కార్యక్రమాలు అమలు కావడం లేదు.

టెలిమెడిసిన్‌ సేవలు అంతంత మాత్రమే

గతంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు వచ్చిన రోగులను వీడియోకాల్‌ ద్వారా నిపుణులైన వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రోగులు ఎవరూ రాకుండానే ఎవరో ఒకరి పేర్లు రాసేసి, వీడియో కాల్‌ చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై వైద్యాధికారులు సైతం పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

ముందుకు సాగని ఎన్‌సీడీ–సీడీ సర్వే

జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సాంక్రమిక , అసాంక్రమి వ్యాధులను గుర్తించే ఎన్‌సీడీ–సీడీ సర్వే ముందుకు సాగడం లేదు. ఈ సర్వేలో 200 ప్రశ్నలు ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ప్రజలకు ఉండటం లేదు. సిబ్బంది సైతం చిత్తశుద్ధి చూపించడం లేదు. రోజుకు నలుగురు, ఐదుగురిని మించి సర్వే చేయలేక పోతున్నారు.

న్యూస్‌రీల్‌

సీహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంల మధ్య ఆధిపత్య పోరు నిలిచిన ఆరోగ్య కార్యక్రమాలు ముందుకు సాగని ఎన్‌సీడీ–సీడీ సర్వే టెలిమెడిసిన్‌ సేవలు అంతంత మాత్రమే ఉమ్మడి కృష్ణాలో ఇదే పరిస్థితి

గాడి తప్పిన వైద్యం

రాష్ట్రంలో వైద్య రంగం గాడితప్పింది. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన సమయంలోనే అనేక లోపాలు వెలుగు చూశాయి. మందులు ఇవ్వడం లేదంటూ రోగులే ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్టెచ్చర్లు లేక బంధువులే రోగులను చేతులపై తీసుకెళ్తున్నారు. గత ఐదేళ్లు వైద్య రంగానికి ఒక సువర్ణ అధ్యాయం. ప్రతి పేదకు నాణ్యమైన వైద్యం అందింది.

– చందా కిరణ్‌తేజ, విజయవాడ

గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష పేరుతో స్పెషలిస్టు వైద్యులే గ్రామాలు, వార్డులకు వచ్చి వైద్య పరీక్షలు చేసేవారు. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ మూలనపడింది. ఇంటింటికీ వచ్చి ఆరోగ్యంపై ఆరా తీసే వారే కరువయ్యారు. ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది.

– సోలే సురేష్‌బాబు, ఉయ్యూరు

No comments yet. Be the first to comment!
Add a comment
టమాటా రైతుకు కన్నీళ్లే 1
1/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 2
2/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 3
3/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 4
4/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 5
5/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 6
6/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 7
7/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 8
8/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 9
9/10

టమాటా రైతుకు కన్నీళ్లే

టమాటా రైతుకు కన్నీళ్లే 10
10/10

టమాటా రైతుకు కన్నీళ్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement