కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో బర్డ్‌ఫ్లూ నియంత్రణలోనే ఉందని.. అయినా అప్రమత్తంగా ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వైరస్ నివారణ, నియంత్రణ చర్యలపై కలెక్టర్ సమీక్ష చేశారు. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణతో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయన్నారు. ప్రజలకు అపోహలు ఉంటే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది తొలగించాలని అధికారులకు సూచించారు. ఎ.కొండూరు మండలం, దీప్లానగర్ పరిసర ప్రాంతాల్లో నియంత్రణ, కట్టడి చర్యలను కొనసాగించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. నిర్దిష్ట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని అనుసరించాలన్నారు. సమీక్షలో జిల్లా పశుసంవర్థక అధికారి ఎం.హనుమంతరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, డీడీ (ఏహెచ్) మోజెస్ వెస్లీ, ఏడీ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పడవ రాకపోకలు సాగిస్తే సీజ్
ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని కృష్ణానదిలో అనుమతి లేకుండా పడవ రాకపోకలు సాగిస్తే కఠిన చర్యలతో పాటు పడవను సీజ్ చేస్తామని ఇన్‌చార్జ్ తహసీల్దార్ మనోహర్ హెచ్చరించారు. గ్రామంలో శనివారం కృష్ణానది వద్ద పడవ రాకపోకలను ఆయన పరిశీలించారు. అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment