ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల

Published Sun, Feb 23 2025 1:23 AM | Last Updated on Sun, Feb 23 2025 1:20 AM

ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల

ముగిసిన వీరమ్మతల్లి తిరునాళ్ల

ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం రాత్రి వైభవంగా ముగిసింది. ఆఖరి రోజు కావటంతో తిరునాళ్లకు భక్తజనం పోటెత్తారు. పెద్ద ముఠా కార్మికులు, కూరగాయల మార్కెట్‌ కార్మికులు జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రభ బండ్లు కానుకగా సమర్పించారు. మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) రోజున ప్రారంభమై 15 రోజుల పాటు సాగిన తిరునాళ్ల మహోత్సవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిని దర్శించుకుని తరించారు. చలువ కావిళ్లు సమర్పించుకున్నారు. పాల పొంగళ్లు చేసి నైవేద్యం ఇచ్చి, పసుపు, కుంకుమలు సారెగా అందించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి కోళ్లు, పొట్టేళ్లను కానుకగా చెల్లించారు. తిరునాళ్ల మహోత్సవంలో జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరునాళ్లలో ప్రభుత్వ అధికారులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు సేవా నిరతి చాటుకున్నారు. వీరమ్మతల్లిని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ పెనమలూరు ఇన్‌చార్జి దేవభక్తుని చక్రవర్తి శనివారం రాత్రి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు జరిపించారు. వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కల్పవల్లి ఆశీస్సులు ఉంటాయని, ప్రజలకు మంచి చేసే అవకాశం కల్పిస్తారని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement