జెడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్‌కు రిమాండ్
కంచికచర్ల(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి భర్త వేల్పుల రమేష్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం నందిగామలోని జడ్జి ఎదుట రమేష్‌తో పాటు తలమాల మరియమ్మ, గారపాటి ఆంధ్రియను పోలీసులు హాజరు పరిచారు. వారికి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని ఎస్‌ఐ బోనగిరి రాజు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి మొదటి భార్య కుమార్తె వాణికి కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన సుధీర్‌తో 2009లో వివాహమైంది. వాణి, సుధీర్‌కు ముగ్గురు సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సుధీర్ ప్రమాదవశాత్తు కాలుజారి నేలబావిలో పడి మరణించాడు. సుధీర్ కర్మకాండలకు జోజి వచ్చారు. అప్పుడు వాణి అత్త తలమాల మరియమ్మ, కుల పెద్ద గారపాటి ఆంధ్రియ, వేల్పుల రమేష్ అతని ఆస్తిలో వాణికి అరెకరం పొలం రాయాలని కోరారు. పెద్దల మాట విన్న జోజి కుమార్తె వాణికి అర ఎకరం పొలం స్వాధీన అగ్రిమెంట్ చేశాడు. అయితే తన పేరుతో ఉన్న పొలాన్ని కుమార్తె వాణికి రాయాలని పెద్దలు బలవంతం చేశారని, భయంతో పొలాన్ని స్వాధీన అగ్రిమెంట్ చేశానని కంచికచర్ల పీఎస్‌లో నాలుగు రోజుల క్రితం జోజి ఫిర్యాదు చేశాడు. వాణి అత్త మరియమ్మ, కులపెద్ద గారపాటి ఆంద్రియ, వేల్పుల రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని నందిగామలోని జడ్జి ఎదుట హాజరుపర్చామని రిమాండ్ విఽధించారని ఎస్‌ఐ తెలిపారు.
ఆదివారం ఉదయం అరెస్ట్
రమేష్‌తోపాటు మరియమ్మ, ఆంధ్రియకు రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment