ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు
ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తున్నాం. మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్ని వసతులు అందించడానికి చర్యలు చేపడుతున్నాం. తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ తదితర అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
–సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, ఆర్‌ఐఓ, ఎన్టీఆర్ జిల్లా


