సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు కొనసాగుతుందని స్టేషన్ మేనేజర్ ఎన్.పోతురాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సమ్మర్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో భాగంగా ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణలో బోర్డింగ్, డే బోర్డింగ్ చేసే సౌకర్యం ఉందన్నారు. విజయవాడలో 8వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి ఉజ్జయిని(మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర), ద్వారక(నాగేశ్వర్), సోమ్‌నాథ్, పూణే (భీమశంకర్), నాసిక్ (త్రాయంబకేశ్వర్), ఔరంగాబాద్(గ్రీష్ణేశ్వర్) జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుని 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు రైలు విజయవాడ చేరుకుంటున్నారు. ట్రైన్ జర్నీ, నైట్ స్టే, అల్పాహారం, వెజిటేరియన్ భోజనం, వాష్ అండ్ చేంజ్, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ ఒకే ప్యాకేజ్‌లో అందుతాయన్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌కు www.irctctourism.com సైట్‌లో సంప్రదించాలని కోరారు.


