ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే నష్టపోతాం
నేను కౌలుకు తీసుకుని 20 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాను. కోత పూర్తయిన తర్వాత మైలవరం మార్కెట్ యార్డులో ఆరబోశాను. ప్రభుత్వం మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. క్వింటాకు రూ.20 సెజ్ కట్టాలని మార్కెట్ యార్డు అధికారులు చెప్పడంతో వ్యాపారులు వెనక్కిపోయారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి నా మొక్కజొన్న పంట మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు దళారులు కొనే అవకాశం లేదు. పది లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయాలి. లేదంటే నష్టపోతాం.
–చెరుకూరి అర్జునరావు, కౌలు రైతు, అనంతవరం, మైలవరం మండలం


