గురుకుల వసతి గృహాన్ని సందర్శించిన సీఎం
నందిగామటౌన్: బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల సంక్షేమ వసతి గృహం, పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, పాఠశాలలోని విద్యా ర్థులతో కొద్దిసేపు ముచ్చటించి విద్యార్థులతో కలిసి తేనీటిని స్వీకరించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి వంటశాల, భోజనశాల పరిశుభ్రత ను, కోడిగుడ్లు, బియ్యం, కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం భోజన రుచి, నాణ్యత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా లేదా తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలను పరిశీలించి అభినందించారు.


