
దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ రఘునందన్‌రావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ రఘునందన్‌రావు దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, వేదపండితులు పాల్గొన్నారు.