
నేటి అలంకారం శ్రీమహాచండీదేవి
● వైభవంగా దసరా ఉత్సవాలు
● శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా
దుర్గమ్మ దర్శనం
● ఇంద్రకీలాద్రికి భారీగా
తరలివస్తున్న భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ శనివారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను కరుణించారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మ దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము టైం స్లాట్‌కు ప్రముఖులు, వీఐపీలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన వీఐపీ టైం స్లాట్‌లో ఎక్కువ రద్దీ కనిపించింది.
దుర్గగుడి అధికారులను
అడ్డుకున్న పోలీసులు
శనివారం రెండో షిప్టు విధులకు హాజరయ్యే ఆలయ అధికా రులు, ఇంజినీరింగ్ సిబ్బందిని పోలీసులు లిఫ్టు వద్ద అడ్డుకున్నారు. లిఫ్టు మార్గంలో ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. లిఫ్టు మీదగా కొండ పైకి ఎవరినీ అనుమతించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలనే తాము పాటిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు తీరుతో ఏఈఓలు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు.
కనకమహాలక్ష్మి, ద్వారకా తిరుమల ఆలయాల నుంచి పట్టువస్త్రాలు
దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి తరఫున ఆ ఆలయ అధికారులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ కె.శోభారాణి, ఆలయ అర్చకులు, అధికారులు పట్టువస్త్రా లతో ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, పూలు, ఉత్తరాంధ్ర సంప్రదాయం ప్రకారం కావడితో అరటిపళ్ల గెలలను అందజేశారు. అనంతరం దుర్గగుడి అధికా రులు అమ్మవారి ప్రసాదాలను అందించారు. దుర్గమ్మకు శనివారం ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ ఎన్.వి.ఎస్.ఎన్. మూర్తి దంపతులు, చైర్మన్ కుమారుడు నివృత్తి రావుతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రికి రాగా దుర్గ గుడి ఈఓ శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈఓ తదితరులు దుర్గగుడి ఈఓకు పట్టు వస్త్రాలు అందజేశారు.
అర్చక సత్కారం
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకలను ఘనంగా సత్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలు, దేవస్థానాలకు చెందిన 200 మంది అర్చకులను సత్కరించి, నగదు పురస్కారాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విచ్చేసి అర్చకులను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున మొత్తం రూ.9 లక్షలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
గాలిగోపురం వద్ద పుష్పాలంకరణ
ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద పత్యేక పుష్పాలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ చేయకపోవడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం గాలిగోపురంతో పాటు లక్ష్మీగణపతి ప్రాంగణంలోనూ పుష్పాలంకరణపై ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపారు.
చూసిన కనులదే భాగ్యం
శ్రీగంగాపార్వతి సమేతంగా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలో ఆదిదంపతుల వెంట అడుగులో అడుగు వేయాలని భక్తులు పరితపించారు. దసరా ఉత్సవాల వేళ తమకు కలిగిన భాగ్యాన్ని తలుచుకుని మురిసిపోయారు.
సారెతో విశాఖపట్నం మహాలక్ష్మి ఆలయ ఈఓ శోభారాణి తదితరులు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ద్వారకా తిరుమల చైర్మన్, ఈఓలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ ఆదివారం శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరి భక్తులకు విజయం సిద్ధిస్తుంది.

నేటి అలంకారం శ్రీమహాచండీదేవి

నేటి అలంకారం శ్రీమహాచండీదేవి

నేటి అలంకారం శ్రీమహాచండీదేవి

నేటి అలంకారం శ్రీమహాచండీదేవి

నేటి అలంకారం శ్రీమహాచండీదేవి