
విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
భక్తి భావం.. జన ప్రవాహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులకు దసరా సెలవుల నేపథ్యంలో అందరూ సొంతూరు బాట పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.
కోనేరుసెంటర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయు డు అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సిబ్బందికి యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.
దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలతో పాటుగా పాతబస్తీలోని ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి పది గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ ప్రాంతం వైపు అధికారులు మళ్లించారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లేకుండా బ్లాక్‌లుగా భక్తులను విడదీస్తూ ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 12గంటల సమయంలో వారిని వినాయకునిగుడి వద్ద ఉన్న క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయ పరిసరాలతో పాటుగా బయట వైపు భక్తులెవరిని ఉంచకుండా వినాయకునిగుడి వైపునకు మళ్లించారు.
– వన్‌టౌన్(విజయవాడపశ్చిమ)
ఆదివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కంపార్ట్‌మెంట్ బయట వేచి ఉన్న భక్తులు
7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ