సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగుల సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదని, ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్‌గా బాధ్య తలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్‌జీజీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణ రెడ్డి, సహాధ్యక్షుడు వేమూరి ప్రసాద్, కార్యదర్శి డి.రమేష్, నగర అధ్యక్షుడు సి.వి.ఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావ డంలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సేవారంగాల్లో వార్షికవృద్ధి లక్ష్య సాధనకు సమష్టి కృషి అవసరమన్నారు. జిల్లాలో ఏడా దిగా సాధించిన విజయాలు అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో సాధ్యమయ్యాయని పేర్కొ న్నారు. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే త్వరితగిన పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటానని భరోసా కల్పించారు. ఏపీ ఎన్జీనో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.ఎస్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించేందుకు ఉద్యోగులూ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.వి. ప్రసాద్, పి.రమేష్, బి.సతీష్ కుమార్, ఎం.రాజుబాబు, డి.విశ్వనాథ్, బి.వి.రమణ, రామకృష్ణ, మహిళా ప్రతినిధి కె.శివలీల, నగర కార్యవర్గ సభ్యులు సి.వి.ఆర్.ప్రసాద్, ఎస్‌కే నజీరుద్దీన్, వి.రాజశేఖర్, దిలీప్ కుమార్, కె.మధుసూదన రావు, శ్రీనివాసరావు, విజయశ్రీ, సాగర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ


