
మందస గ్రామదేవత అన్నపూర్ణమ్మతల్లికి పూజలు చేస్తున్న భక్తులు
మందస: మేజరు పంచాయతీ మందస పట్టణంలోని గ్రామదేవత అన్నపూర్ణమ్మతల్లి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజుల కాలం నుంచి ఇక్కడ గ్రామదేవత ఉత్సవాలు వైభ వంగా నిర్వహిస్తున్నారు. భక్తులు వేకువజాము నుంచే అన్నపూర్ణమ్మతల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజ లు చేశారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దేవరవీధిలో గల ప్రత్యేక పూజారులు దాసరి గణేశ్వరరావు, కృష్ణమ్మ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఉంచి, పూజలు చేస్తారు. ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలకడానికి మేళతాళాలు, పూర్ణకుంభాలు, గజముద్దలతో భారీగా భక్తులు అన్నపూర్ణమ్మ గుడికి చేరుకున్నారు. ఆల యంలో పూజలు నిర్వహించి, చల్లదనం చేశారు. అమ్మవారిని ఊరేగించడానికి ప్రత్యేక రథం ఏర్పా టు చేసి, పీఠాన్ని తయారు చేశారు. వీటిని అమ్మవా రి వద్దకు చేర్చారు. భక్తిశ్రద్ధలతో ఘనంగా అమ్మవారిని దేవరవీధిలో కుటీరానికి తీసుకువచ్చారు.

గ్రామదేవత ఊరేగింపునకు ప్రత్యేకంగా తయారు చేసిన రథం
Comments
Please login to add a commentAdd a comment